లాక్‌డౌన్‌లో జీహెచ్‌ఎంసి ఇతర శాఖలతో సమన్వయంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2020-04-15T20:37:14+05:30 IST

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నేపధ్యంలో గ్రేటర్‌ పరిధిలో జీహెచ్‌ఎంసి అధికారులు పోలీసులు, మెడికల్‌ సిబ్బందితో సమన్వయం చేసుకుని పనిచేయాలని మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

లాక్‌డౌన్‌లో జీహెచ్‌ఎంసి ఇతర శాఖలతో సమన్వయంతో పనిచేయాలి

హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నేపధ్యంలో గ్రేటర్‌ పరిధిలో జీహెచ్‌ఎంసి అధికారులు పోలీసులు, మెడికల్‌ సిబ్బందితో సమన్వయం చేసుకుని పనిచేయాలని మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో ఆయాశాఖలు కట్టుదిట్టంగా పనిచేయాలని అన్నారు. జీహెచ్‌ఎంసి పరిదిలో గుర్తించిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు జరిగేలా చూడాలన్నారు. ప్రజలు ఎకకడ గుమిగూడినా పోలీసులు, మెడికల్‌ సిబ్బంది తగిన రీతలో స్పందించాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో ఇంటికే నిత్యావసరాలను పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు. అత్యవసర వౌద్య, ఇతర సేవల కోసం 104 కానీ, 040-21111111 నెంబర్‌కు ఫోన్‌చేసి సహాయం పొందవచ్చన్నారు. అధికారుల బృందం కంట్రోల్‌ రూమ్‌లలో రాత్రి పగలు అందుబాటులో ఉండలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో కావాల్సిన ఏర్పాట్లును చేసుకోవాలని, జోనల్‌అధికారి పరిధిలో అన్ని వైద్య సౌకర్యాలతో అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రజలు లాక్‌డౌన్‌ను ఉల్లంఘించకుండా చూడాలి. నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని, దాతలు ముందుకు వస్తే పోలీస్‌ లేదా జీహెచ్‌ఎంసి అధికారులను సంప్రదించి ముందస్తు అనుమతి తీసుకోవాలసి సూచించారు. 

Updated Date - 2020-04-15T20:37:14+05:30 IST