జగిత్యాలకు ముంబయి భయం
ABN , First Publish Date - 2020-06-01T20:18:24+05:30 IST
జిగిత్యాలకు ముంబై భయం పట్టుకుంది.
జిగిత్యాలకు ముంబై భయం పట్టుకుంది. వలస కార్మికుల రాకతో పల్లెల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వాళ్లంతా సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో వారందరికీ పరీక్షలు చేయగా కరోనా పాజిటీవ్ కేసులు బయటపడుతున్నాయి. ఒకటి, రెండు కాదు గడిచిన వారం రోజుల్లో ఏకంగా 50కి పైగా కరోనా పాజిటీవ్ కేసులు బయటపడడంతో అధికారులు, జిల్లా వాసులు టెన్షన్ పడుతున్నారు.
జగిత్యాలలో వలస కార్మికులకు ఒకే రోజు 9 పాజిటీవ్ కేసులు, మరో రోజు 8, ఇంకొకరోజు 7 ఇలా కేసులు పెరుగుతూ పోయాయి. ప్రస్తుతం జగిత్యాలలో మొత్తం కేసులు 59 ఉండగా అందులో 55 కేసులు వలస కార్మికులవే. ఇటీవల శ్రామిక్ రైలుతో జిల్లాకు చెందిన వందలాదిమంది కార్మికులు వచ్చారు. వారందరినీ క్వారంటైన్‌లో ఉంచారు. దీంతో పల్లెల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.