అందరినీ కలుపుకుపోవాలి
ABN , First Publish Date - 2020-12-31T04:34:49+05:30 IST
అందరినీ కలుపుకుపోవాలి

టీఆర్‌ఎస్ శ్రేణులతో జడ్పీ చైర్మన్ జగదీశ్
గోవిందరావుపేట, డిసెంబరు 30: పార్టీలో అందరినీ కలుపుకుపోవాలని టీఆర్‌ఎస్ శ్రేణులను జడ్పీచైర్మన్ కుసుమ జగదీశ్ కోరారు. మండల కేంద్రంలో మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు మురహరి భిక్షపతి అధ్యక్షతన బుధవారం జరగ్గా ముఖ్య అతిథిగా జగదీశ్ హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవయ్యేలా చూడాలని, ఏమైనా సమస్యలు ఎదురైతే తనను సంప్రదించొచ్చని అన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు వికలాంగులకు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ తుమ్మల హరిబాబు, నాయకులు పల్లా బుచ్చయ్య, పోరిక గోవింద్‌నాయక్, మధుసూదన్‌రెడ్డి, మాచినేని సాంబయ్య, దూడ పాక రాజేందర్, లక్ష్మారెడ్డితోపాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘాల నాయ కులు పాల్గొన్నారు.