ములుగు: రాత్రికిరాత్రే మావోయిస్టుల మృతదేహాలు తరలింపు
ABN , First Publish Date - 2020-10-19T13:21:04+05:30 IST
జిల్లాలో నిన్న జరిగిన నర్సింహాసాగర్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ములుగు: జిల్లాలో నిన్న జరిగిన నర్సింహాసాగర్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎన్‌కౌంటర్ ప్రదేశానికి మీడియా రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. రాత్రికి రాత్రే మృతదేహాలను తరలించారు.
ములుగు జిల్లా మంగపేట మండలం నర్సింహసాగర్ సమీపంలోని ముసలమ్మగుట్ట అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. రెండు నెలలుగా తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దు అడవులతో పాటు తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట అడవులను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఎన్‌కౌంటర్ జరిగిందని, ఇద్దరు మావోయిస్టుల హతమయ్యారని ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జి పాటిల్ స్పష్టం చేశారు. అయితే.. మృతుల వివరాలను వెల్లడించడంలో గోప్యత పాటించారు. ఘటనాస్థలం నుంచి తుపాకులు, కిట్‌బ్యాగులను స్వాధీనపరచకున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఒకరు రాష్ట్ర స్థాయి నేత అయ్యి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.