రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-10-04T09:41:52+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని, కార్పొరేట్‌ కంపెనీల లబ్ధి కోసమే ఈ తతంగమని కాంగ్రెస్‌ జాతీయ

రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలి

ములుగు ఎమ్మెల్యే  సీతక్క


ఏటూరునాగారం, అక్టోబరు 3 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని, కార్పొరేట్‌ కంపెనీల లబ్ధి కోసమే ఈ తతంగమని కాంగ్రెస్‌ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములు గు ఎమ్మెలే దనసరి సీతక్క అన్నారు. కేంద్ర వ్యవసా య బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు చిటమట రఘ ఆధ్యర్యంలో ఏటూరునాగా రం బస్టాండ్‌ ఆవరణలోని జాతీయ రహదారిపై శని వారం బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ఎప్పటికప్పుడు వాటి నిల్వలపై పరిమితులు విధిం చేదన్నారు. మోదీ ప్రభుత్వం పరిమితులను పూర్తిగా ఎత్తేసిందని ధ్వజమెత్తారు. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించేదుకు వెళుతున్న రాహుల్‌గాంధీ, ప్రియాం కగాంధీలను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. దీన్ని కాంగ్రెస్‌ పార్టీ ములుగు జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.


కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నల్లేల కుమారస్వామి, కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌ గౌడ్‌, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షు డు ఎండీ. ఆయుబ్‌ఖాన్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఇరుసవడ్ల వెంకన్న, సర్పంచ్‌ ఈసం రాంమూర్తి, కన్నా యిగూడెం జెడ్పీటీసీ నమకరం చంద్‌ గాంధీ, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు బానోతు రవి, నాయకులు మైలజయరాం రెడ్డి, ఖలీల్‌ఖాన్‌, ఎంపీటీసీ గుడ్ల శ్రీల తదేవేందర్‌, పీఎసీఎస్‌ డైరెక్టర్‌ వంగపండ్ల రవి, బాసా ని విద్యాసాగర్‌, వసంత శ్రీనివాస్‌ వావిలాల ఎల్లయ్య, గడ్డం శ్రీధర్‌, ఎండి. గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.


వెంకటాపురంలో

వెంకటాపురం(నూగూరు) : రైతు వ్యతిరేక బిల్లును తక్షణమే రద్దు చేయాలని ములుగు ఎమ్మెల్యే ఽ  సీతక్క డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలోని అతిథి గృహం ఆవరణలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రంలో అరాచక పాలన సాగు తోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ఈప్రాం త అభివృద్ధి జరిగిందని అన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్‌ జి ల్లా, మండల నాయకులు పాల్గొన్నారు. 


ముత్తయ్య కుటుంబానికి పరామర్శ 

ఇటీవల మృతిచెందిన బాలసాని ముత్తయ్య కు టుంబసభ్యులను శనివారం ఎమ్మెల్యే సీతక్క, ఖమ్మం జడ్పీచైర్మన్‌ లింగాల కమలరాజ్‌లు పరామర్శించారు.  ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు మధు, కిషోర్‌, వరప్రసాద్‌, బోదె బోయిన బుచ్చయ్య, నల్లెల కుమారస్వామి, పల్నాటి నాగేశ్వర్‌రావు, వెంకన్న, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-10-04T09:41:52+05:30 IST