సీతక్క అరెస్టుకు నిరసనగా ఆందోళనకు దిగిన కాంగ్రెస్
ABN , First Publish Date - 2020-06-02T23:41:03+05:30 IST
ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క అక్రమ హౌస్ అరెస్టును నిరసిస్తూ..
ములుగు: ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క అక్రమ హౌస్ అరెస్టును నిరసిస్తూ.. గోవిందరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగి తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ మండల అధ్యక్షుడు పన్నాల ఎల్లారెడ్డి నేతృత్వం వహించారు. జాతీయ రహదారి 163పై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీతక్కను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వింత ధోరణులు, అహంకార పూరిత చర్యలు, అక్రమ అరెస్టులు రాజ్యాంగ వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పలువరు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.