ములుగు జిల్లాలో అంతుచిక్కని వ్యాధి కలకలం
ABN , First Publish Date - 2020-12-27T19:41:27+05:30 IST
కన్నాయిగూడెం మండలం, ముప్పనపల్లిలో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది.

ములుగు జిల్లా: కన్నాయిగూడెం మండలం, ముప్పనపల్లిలో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. రెండు వారాల వ్యవధిలో ఆరుగురు మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. రెండు రోజుల్లోనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. జ్వరం, కడుపు ఉబ్బరం లక్షణాలతో గ్రామస్తులు మృతి చెందుతున్నారు. దీంతో అధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అయితే అటవీ ప్రాంతం లోపలికి ఉన్న ఏజన్సీ గ్రామం కావడంతో సరిగా వైద్యం అందడంలేదు.