ములుగు జిల్లాలో యువతి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-10-31T12:36:12+05:30 IST

జిల్లాలోని వాజేడ్ మండలం మోట్లగూడెం గ్రామానికి చెందిన ఉమాదేవి(28) అనే యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

ములుగు జిల్లాలో యువతి ఆత్మహత్య

ములుగు: జిల్లాలోని వాజేడ్ మండలం మోట్లగూడెం గ్రామానికి చెందిన ఉమాదేవి(28) అనే యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.  వివాహితుడైనా ప్రగళ్లపల్లి గ్రామానికి చెందిన గాంధీ అనే వ్యక్తితో ఉమాదేవికి అక్రమ సంబంధం ఉంది. ఈ క్రమంలో ఇటీవలే గాంధీ కుమారుడు, భార్య వరంగల్‌లోని లాడ్జ్‌లో ఇరువురిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు. మరోవైపు అక్రమసంబంధంపై గాంధీకి, ఉమాదేవికి వాజేడ్ పోలీస్‌లు గతంలో చాలా సార్లు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉమాదేవి ఆత్మహత్యతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Read more