ముల్కనూరు మహిళా డెయిరీలో కెనరా బ్యాంకు ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-20T04:30:18+05:30 IST

ముల్కనూరు మహిళా డెయిరీలో కెనరా బ్యాంకు ప్రారంభం

ముల్కనూరు మహిళా డెయిరీలో కెనరా బ్యాంకు ప్రారంభం

భీమదేవరపల్లి, డిసెంబరు 19: ముల్కనూరు మహిళా డెయిరీలో ముల్కనూరు సహకార బ్యాంకు అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి శనివారం కెనరా బ్యాంకును ప్రారంభించారు. డెయిరీలో మహిళా రైతులకు ప్రతీనెల రూ.కోట్ల మేర పాల బిల్లులు చెల్లిస్తున్నారు. వివిధ బ్యాంకుల్లో రద్దీ ఉండడంతో పాల బిల్లుల చెల్లింపుల సమయంలో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మహిళా డెయిరీలోనే కెనరా బ్యాంకును ఏర్పాటు చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో డెయిరీ అధ్యక్షురాలు గుర్రాల విజయ, జనరల్‌ మేనేజర్‌ మార్పాటి భాస్కర్‌రెడ్డి, కెనరా బ్యాంకు వరంగల్‌ రీజినల్‌ మేనేజర్‌ రాంబాబు, బ్రాంచ్‌ మేనేజర్‌ తిరుపతి, ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more