హైదరాబాద్‌ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు

ABN , First Publish Date - 2020-10-21T10:04:12+05:30 IST

హైదరాబాద్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొందరు సోషల్‌ మీడియాను వాడుకుంటున్నారని, వారిపై పోలీసులు సూమోటోగా కేసులు నమోదు చేయాలని..

హైదరాబాద్‌ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు

కేంద్రం నుంచి వరద సాయం లేదు: ఎంఎస్‌ ప్రభాకర్‌ 


హైదరాబాద్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొందరు సోషల్‌ మీడియాను వాడుకుంటున్నారని, వారిపై పోలీసులు సూమోటోగా కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ విప్‌ ఎంఎస్‌ ప్రభాకర్‌ కోరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాథమిక అంచనాల ప్రకారం భారీ వర్షాలు, వరదల కారణంగా రూ.8 వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని, సాయం కోసం కేంద్రానికి లేఖ రాసినా స్పందన లేదన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నియోజకవర్గం సికింద్రాబాద్‌ పరిధిలోనూ నష్టం జరిగిందని, అయినా సాయం కోసం కేంద్రాన్ని ఒప్పించలేక పోతున్నారని విమర్శించారు.  

Updated Date - 2020-10-21T10:04:12+05:30 IST