స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నిధులను.. మాకే ఇవ్వాలి: ఎంపీటీసీలు

ABN , First Publish Date - 2020-10-01T09:13:31+05:30 IST

స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఎంపీటీసీలకే కేటాయించాలని రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలు చింపుల...

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నిధులను.. మాకే ఇవ్వాలి: ఎంపీటీసీలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఎంపీటీసీలకే కేటాయించాలని రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలు చింపుల శైలజా సత్యనారాయణ రెడ్డి కోరారు. ఎంపీటీసీలకు నిధులు, విధులు, అధికారాలు, బాధ్యతలు అప్పజెప్పాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మండలాలకు 25 శాతం నిధులు కేటాయించాలని చెప్పారు. ఎంపీటీసీల గౌరవ వేతనాన్ని రూ.15వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు.  ఈ మేరకు ఎంపీ కేశవరావుకు వినతిపత్రం సమర్పించారు. 

Updated Date - 2020-10-01T09:13:31+05:30 IST