సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ సోయం బాపూరావు

ABN , First Publish Date - 2020-05-12T00:14:29+05:30 IST

ఎంపీ సోయం బాపూరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భైంసాలో పథకం ప్రకారం అల్లర్లు జరుగుతున్నాయని ఆరోపించారు. రాత్రి కూడా కొందరు అలాంటి దాడులకే పాల్పడ్డారని అన్నారు.

సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ సోయం బాపూరావు

నిర్మల్: ఎంపీ సోయం బాపూరావు మరోసారి సంచలన  వ్యాఖ్యలు చేశారు. భైంసాలో పథకం ప్రకారం అల్లర్లు జరుగుతున్నాయని ఆరోపించారు. రాత్రి కూడా కొందరు అలాంటి దాడులకే పాల్పడ్డారని అన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. మూకుమ్మడి ప్రార్థనలను ప్రశ్నించినందుకే దాడులు చేశారని అన్నారు. జిల్లా ఎస్పీ.. ఎంఐఎంకు వత్తాసు పలుకుతూ తప్పుదోవ పట్టిస్తున్నారని ఎంపీ బాపూరావు ధ్వజమెత్తారు. పోలీసుల తీరు మారకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. జరగబోయే పరిణామాలకు ఎస్పీ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఒక వర్గం ఓట్ల కోసం మెజారిటీ ప్రజలకు టీఆర్ఎస్ ద్రోహం చేస్తోందన్నారు. ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకోబోమన్నారు.

Updated Date - 2020-05-12T00:14:29+05:30 IST