ఆంధ్రజ్యోతి ‘ఫిరోజ్‌ఖాన్‌’ కథనంపై రేవంత్‌రెడ్డి స్పందన

ABN , First Publish Date - 2020-06-23T17:05:16+05:30 IST

మేమేం పాపం చేశాం.. మాకు పైసలియ్యరా? అంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. సాయం కోసం అమరజవాన్ ఫిరోజ్‌ఖాన్

ఆంధ్రజ్యోతి ‘ఫిరోజ్‌ఖాన్‌’ కథనంపై రేవంత్‌రెడ్డి స్పందన

హైదరాబాద్: మేమేం పాపం చేశాం.. మాకు పైసలియ్యరా? అంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. సాయం కోసం అమరజవాన్ ఫిరోజ్‌ఖాన్ కుటుంబం ఎదురుచూపు అంటూ.. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తపై రేవంత్ రెడ్డి ట్విట్టర్‌ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుడికి జరిగిన ఘోర అవమానంగా భావిస్తున్నామని చెప్పారు. ఫిరోజ్ ఖాన్ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తను రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో ట్యాగ్ చేశారు.

Read more