మోదీవి ఫ్యూడల్ విధానాలు: ఎంపీ రంజిత్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-05-24T09:29:14+05:30 IST
ప్రధాని నరేంద్ర మోదీ ఫ్యూడల్ విధానాలు అనుసరిస్తున్నారని, రాష్ట్రాలకు నిధుల కేటాయింపు విషయంలో..

హైదరాబాద్, మే 23(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ ఫ్యూడల్ విధానాలు అనుసరిస్తున్నారని, రాష్ట్రాలకు నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని చేవెళ్ల టీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కంటే మోదీ ఘోరమైన తప్పులు చేస్తున్నారని, పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు. తాను ఎంపీగా గెలిచి ఏడాది పూర్తైన సందర్భంగా శనివారం తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఏడాది కాలంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో చేపట్టిన పనుల గురించి వివరించారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ముందు రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడాలని, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు.