జగ్గారెడ్డికి టీఆర్ఎస్‌లో నో ఎంట్రీ: ఎంపీ కొత్తప్రభాకర్

ABN , First Publish Date - 2020-06-23T18:52:33+05:30 IST

జగ్గారెడ్డికి టీఆర్ఎస్‌లో నో ఎంట్రీ: ఎంపీ కొత్తప్రభాకర్

జగ్గారెడ్డికి టీఆర్ఎస్‌లో నో ఎంట్రీ: ఎంపీ కొత్తప్రభాకర్

సంగారెడ్డి: మాయ మాటలతో సంగారెడ్డిలో జగ్గారెడ్డి గెలిచారని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ...కాళ్లు మొక్కితే జగ్గారెడ్డికి ప్రజలు ఓట్లు వేశారని వ్యాఖ్యానించారు. ఒక్క రోజైనా సంగారెడ్డి ప్రజలకు కనిపించాడా జగ్గారెడ్డి అని ప్రశ్నించారు. కరోనా వస్తే ప్రజలను ఒక్క సారి కూడా పట్టించుకో లేదన్నారు. సంగారెడ్డిలో టీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ లేదని.. నమ్మి ఓట్లేస్తే ప్రజలకు జగ్గారెడ్డి మంచి గుణపాఠం చెప్పారని అన్నారు. జగ్గారెడ్డికి ఇళ్లు, ముంగిలి,  ఫోన్ నెంబర్ ఏదీ ఉండదని... హోటల్లో దిగి... ప్రెస్ మీట్ పెట్టి వెళతాడని దుయ్యబట్టారు. టీఆర్ఎస్‌లోకి జగ్గారెడ్డికి నో ఎంట్రీ అని స్పష్టం చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంపై కేసీఆర్, హరీష్ రావులు దృష్టి పెట్టారని తెలిపారు. కాళేశ్వరం నుంచి నీళ్లు తెస్తామని చెప్పారు. కరోనాను అరికట్టడంలో తెలంగాణ సర్కారు ముందుందని మోదీ చెబితే.. ఇక్కడి బీజేపీ నేతలు దానాకి భిన్నంగా మాట్లాడుతున్నారని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. 


Read more