సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ

ABN , First Publish Date - 2020-12-20T02:43:03+05:30 IST

సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ రాశారు. మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు ఆపి రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని కుదేలు చేశారని..

సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ రాశారు. మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు ఆపి రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని కుదేలు చేశారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ తప్పుడు నిర్ణయాలతో లక్షలాది కార్మికులు పస్తులున్నారన్నారు. ధరణి వెబ్‌సైట్‌ ప్రజలకు ఇబ్బందిగా మారిందని చెప్పారు. పాత పద్ధతిలో వారసత్వ మార్పిడి ఉచితంగా చేయాలని సూచించారు. రిజిస్ట్రేషన్లపై వెనక్కి తగ్గినట్లే ఎల్‌ఆర్‌ఎస్‌ను సైతం వెనక్కి తీసుకోవాలని కోరారు. ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో పేదలను దోచుకుంటున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. 

Read more