కేసీఆర్‌కి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ
ABN , First Publish Date - 2020-07-09T02:13:09+05:30 IST
సీఎం కేసీఆర్‌కి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన పెద్దపల్లి జవాన్ శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోవాలని
హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన పెద్దపల్లి జవాన్ శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రూ.50 లక్షల సాయం, భార్యకు ఉద్యోగం ఇవ్వాలని లేఖలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు.
జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాను సాలిగం శ్రీనివాస్ అమరుడైన విషయం తెలిసిందే. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన సాలిగం శ్రీనివాస్ 2012లో ఆర్మీలో చేరారు. బెంగళూరులో శిక్షణ పూర్తిచేసుకుని, చండీగఢ్, రాజస్థాన్‌లో పనిచేశారు. రెండేళ్ల క్రితం జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా 226 ఆర్మీ ఫీల్డ్ యూనిట్‌కు బదిలీ అయ్యారు. కొవిడ్ లాక్‌డౌన్‌లో సెలవులపై ఇంటికి వచ్చిన శ్రీనివాస్.. గత నెల 7న తిరిగి విధులకు వెళ్లారు. సోమవారం విధి నిర్వహణలో ఉండగా.. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆయన అమరుడయ్యారని ఉన్నతాధికారులు తెలిపారు.