రేవంత్ రెడ్డి అరెస్టుపై స్పీకర్‌కు తమిళనాడు ఎంపీ లేఖ

ABN , First Publish Date - 2020-03-13T18:31:32+05:30 IST

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ విషయాన్ని స్పీకర్‌ ఓం బిర్లా దృష్టికి తమిళనాడు ఎంపీ జ్యోతిమణి తీసుకెళ్లారు.

రేవంత్ రెడ్డి అరెస్టుపై స్పీకర్‌కు తమిళనాడు ఎంపీ లేఖ

ఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ విషయాన్ని స్పీకర్‌ ఓం బిర్లా దృష్టికి తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ జోతిమణి తీసుకెళ్లారు. ఈ మేరకు స్పీకర్‌కు ఆమె లేఖ రాశారు. డ్రోన్‌ కేసులో రేవంత్‌రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్ట్‌ చేశారన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. రాజకీయ కారణాలతోనే రేవంత్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారని స్పీకర్‌కు తెలిపారు. అక్రమ అరెస్టుపై వాయిదా తీర్మానం కోరిన ఆమె.. రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి.. బెయిల్ రాకుండా ప్రభుత్వం చేస్తుందని లేఖలో అన్నారు. రేవంత్‌రెడ్డిని విడుదల చేయాలని కోరారు.




ఎవరీ జోతిమణి..?

తమిళనాడులోని కరూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన జోతిమణి.. చురుకైన రాజకీయ నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ యూత్ లీడర్ స్థాయి నుంచి ఎంపీగా ఎదిగారు. తమిళ, మలయాళం భాషలతో పాటు ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుచర గణంలో ఆమె ఒకరు. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటారు.  



Updated Date - 2020-03-13T18:31:32+05:30 IST