ముందస్తు ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-04-25T09:42:19+05:30 IST

కరోనా కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే లాక్‌డౌన్‌ విధించారని, దీంతో పేదలు, వలస కూలీలు తీవ్ర ..

ముందస్తు ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్‌

మోదీ చర్యలతో వలస కార్మికులు, పేదలకు ఇబ్బందులు: ఒవైసీ

రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని విజ్ఞప్తి


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే లాక్‌డౌన్‌ విధించారని, దీంతో పేదలు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్రం ఘోరం గా విఫలమైందని ఆరోపించారు. శుక్రవారం శాస్ర్తిపురంలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు మజ్లిస్‌ పార్టీ తరఫున కరోనా రక్షణ కిట్‌లను పం పిణీ చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలస కార్మికులకు రేషన్‌ అందడం లేదని, ఉద్యోగులు, కార్మికులు వేతనాలు అందుకోలేక అనేక ఇబ్బందు లు పడుతున్నారని చెప్పారు. పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు చేపట్టే ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని, సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ రామ్మోహన్‌, మునిసిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-04-25T09:42:19+05:30 IST