అమ్మ వద్దు.. ఆస్తి ముద్దు

ABN , First Publish Date - 2020-05-11T08:35:02+05:30 IST

ఆస్తి కోసం కన్న తల్లినే ఇంటి నుంచి గెంటేయడంతో ఆ తల్లి మాతృ దినోత్సవం రోజునే కుమారుడి ఇంటి ఎదుట మౌన పోరాటానికి ..

అమ్మ వద్దు.. ఆస్తి ముద్దు

  • కన్న తల్లిని గెంటేసిన కుమారుడు
  • మాతృ దినోత్సవం రోజునే అవమానం
  • కుమారుడి ఇంటి వద్ద తల్లి మౌనదీక్ష

బూర్గంపాడు, మే 10: ఆస్తి కోసం కన్న తల్లినే ఇంటి నుంచి గెంటేయడంతో ఆ తల్లి మాతృ దినోత్సవం రోజునే కుమారుడి ఇంటి ఎదుట మౌన పోరాటానికి దిగింది. ఈ ఘటన ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో జరిగింది. అయిలూరి రంగారెడ్డి, వెంకట కోటమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు శ్రీనివాసరెడ్డి ఉన్నారు. పిల్లలందరూ జీవితంలో స్థిరపడ్డారు. 3 నెలల క్రితం రంగారెడ్డి మృతి చెందిన తర్వాత వెంకట కోటమ్మకు కష్టాలు మొదలయ్యాయి. తండ్రి పేరిట ఉన్న ఆస్తి కోసం శ్రీనివాసరెడ్డి తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని బాధితురాలు వెంకట కోటమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. శుక్రవారం రాత్రి తల్లిని శ్రీనివాసరెడ్డి చితకబాది ఇంటి నుంచి గెంటేశాడు. గాయాలతో ఉన్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి చేరిన బాధితురాలు ఆదివారం కుమారుడి ఇంటి ఎదుట మౌన పోరాటానికి దిగింది. కుమారుడు తరచూ దుర్భాషలాడుతూ కొడుతున్నాడని, తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Updated Date - 2020-05-11T08:35:02+05:30 IST