రంగారెడ్డిలో తల్లీకొడుకు ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-05-30T02:32:48+05:30 IST
రంగారెడ్డిలో తల్లీకొడుకు ఆత్మహత్య

రంగారెడ్డి: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్శ కోట్ లక్ష్మీ నర్సింహ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. తల్లీకొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. నార్సింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి మృతదేహాలను తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక తల్లీకొడుకు ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలవనున్నాయి. ఈ సంఘటనతో ఇరు కుటుంబాల సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.