క్వారంటైన్‌లో ఉన్నవారిపై మరింత నిఘా
ABN , First Publish Date - 2020-03-25T09:59:44+05:30 IST
క్వారంటైన్‌లో ఉన్నవారిపై వైద్య ఆరోగ్య శాఖ మరింత నిఘా పెట్టింది. ఇంట్లోనే ఉండాలన్న సర్కారు విన్నపాలను చాలామంది పెడచెవిన పెడుతున్నారు.

రోజుకు రెండుసార్లు ఫొటో తీసి పంపాలి
వైద్య ఆరోగ్య సిబ్బందికి ప్రభుత్వ ఆదేశం
హైదరాబాద్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): క్వారంటైన్‌లో ఉన్నవారిపై వైద్య ఆరోగ్య శాఖ మరింత నిఘా పెట్టింది. ఇంట్లోనే ఉండాలన్న సర్కారు విన్నపాలను చాలామంది పెడచెవిన పెడుతున్నారు. బయట తిరుగుతున్నారు. కొంతమంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా క్వారంటైన్‌లో ఉన్నవారిని సరిగా పర్యవేక్షించడం లేదు. దీంతో అటు క్వారంటైన్‌లో ఉన్నవారిపైనా, ఇటు సిబ్బందిపైన సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. సిబ్బంది కచ్చితంగా క్వారంటైన్‌లో ఉన్నవారి ఇళ్ల వద్దకు వెళ్లి మ్యాప్‌లో పిన్ చేసేలా ఆదేశించారు. క్వారంటైన్‌లో ఉన్నవారిని రోజూ ఉదయం, సాయంత్రం వారి ఇంటికెళ్లి ఫొటో తీసి వెంటనే అప్‌లోడ్ చేయాలి. దీనికి ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి ట్యాబ్‌లు ఇచ్చారు. దీని ద్వారా వైద్య సిబ్బంది సరిగా పనిచేస్తొందో లేదో తెలుసుకోవడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 19,313 మంది సర్వైలెన్స్‌లో ఉన్నారు. వీరిలో ఉత్తర తెలంగాణలో ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం.