మోదీ మరింత కాలం దేశసేవ చేయాలి

ABN , First Publish Date - 2020-09-18T09:41:29+05:30 IST

: ప్రధాని మోదీ మరింత కాలం దేశ సేవ చేయాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. మోదీ పుట్టిన రోజు

మోదీ మరింత కాలం దేశసేవ చేయాలి

ప్రధానికి సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు


హైదరాబాద్‌, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ మరింత కాలం దేశ సేవ చేయాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా గురువారం తెలంగాణ ప్రజల తరఫున ఆయనకు కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, సీఎం కేసీఆర్‌, తెలంగాణ ప్రజలంతా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని మోదీ గురువారం ట్వీట్‌ చేశారు. కాగా, మోదీ ప్రధాని కావాలని దేశ ప్రజల అదృష్టమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మోదీకి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2020-09-18T09:41:29+05:30 IST