రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు!

ABN , First Publish Date - 2020-06-18T09:29:18+05:30 IST

రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు

రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు!

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలతోపాటు భారీ వర్షాలు కూడా కురిసాయి. మరోవైపు తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 

Updated Date - 2020-06-18T09:29:18+05:30 IST