జీహెచ్ఎంసీలో మొబైల్ శ్మశానవాటిక ప్రయోగం

ABN , First Publish Date - 2020-07-22T22:08:34+05:30 IST

జీహెచ్ఎంసీలో మొబైల్ శ్మశానవాటిక ప్రయోగాత్మకంగా వినియోగించారు. కరోనా నేపథ్యంలో దహన సంస్కారాలపై జీహెచ్ఎంసీ నూతన కార్యాచరణ సిద్ధం చేసింది.

జీహెచ్ఎంసీలో మొబైల్ శ్మశానవాటిక ప్రయోగం

హైదరాబాద్: జీహెచ్ఎంసీలో మొబైల్ శ్మశానవాటికను ప్రయోగాత్మకంగా వినియోగించారు. కరోనా నేపథ్యంలో దహన సంస్కారాలపై జీహెచ్ఎంసీ నూతన కార్యాచరణను సిద్ధం చేసింది. వీల్ ఆన్ క్రిమేషన్‌పై  అధికారులు దృష్టి సారించారు. రూ .7.5 లక్షలతో బాక్సులను జీహెచ్ఎంసీ కొనుగోలు చేసింది. మొదటి దశ ట్రయల్స్‌ను అధికారులు పూర్తి చేశారు. మొబైల్ ఎలక్రికల్ క్రిమేషన్ బాక్సులతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. చక్రాలపై ఎలక్రికల్ శ్మశానవాటికను ఎక్కడికైనా తరలించే సౌకర్యాన్ని కల్పించారు. ఎర్రగడ్డ శ్మశానవాటికలో మొబైల్ క్రిమేషన్ బాక్సు ప్రయోగాత్మకంగా వినియోగించారు. ప్లగ్ ఇన్ మోడల్‌గా ఎక్కడికైనా క్రిమేషన్ బాక్స్‌ను రవాణా చేసే సౌలభ్యముంది. 1,200 డిగ్రీల ఫారెన్‌హీట్‌తో రెండు గంటల్లోనే జీహెచ్ఎంసీ సిబ్బంది అంత్యక్రియలు పూర్తి చేశారు.

Updated Date - 2020-07-22T22:08:34+05:30 IST