మానసకు ఎమ్మెల్సీ చేయూత

ABN , First Publish Date - 2020-12-26T08:01:59+05:30 IST

కమర్షియల్‌ పైలట్‌ శిక్షణకు ఎంపికై శిక్షణ కోసం డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న మానసకు ఎమెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అండగా నిలిచారు

మానసకు ఎమ్మెల్సీ చేయూత

2.5 లక్షల సాయం ప్రకటించిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి 

‘ఆంధ్రజ్యోతి’కథనానికి స్పందన 


గిర్మాజిపేట, డిసెంబరు 25: కమర్షియల్‌ పైలట్‌ శిక్షణకు ఎంపికై శిక్షణ కోసం డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న మానసకు ఎమెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అండగా నిలిచారు. శిక్షణకు అవసరమైన ఫీజు మొత్తం రూ.2.5 లక్షలు చెల్లిస్తానని ప్రకటించారు. వరంగల్‌ గిర్మాజీపేటకు చెందిన మానస పైలట్‌ శిక్షణ ఫీజు చెల్లించలేని దైన్యస్థితి గురించి శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో  ‘ఆకాశమే హద్దుగా ఎదుగుతా, ఆర్థికంగా చేయూత ఇవ్వండి’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఉదయం మానస తండ్రి పొలెపాక గోపికి ఫోన్‌ చేసి మాట్లాడారు. మానస శిక్షణ ఫీజు రూ.2.5లక్షలను శనివారం అందజేస్తానని తెలిపారు. ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామంటూ మానస తల్లిదండ్రులు గోపి, భాగ్య కృతజ్ఞతలు తెలిపారు. సాయం ప్రకటించిన శ్రీనివాసరెడ్డికి, ఇందుకు సహకరించిన ‘ఆంధ్రజ్యోతి’కి జీవితాంతం రుణపడి ఉంటానని మానస ఈ సందర్భంగా చెప్పారు.

Updated Date - 2020-12-26T08:01:59+05:30 IST