ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

ABN , First Publish Date - 2020-03-13T09:21:39+05:30 IST

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. సెలవు దినాలైన శని, ఆదివారాలు మినహా ఈనెల 19వ తేదీ వరకు నామినేషన్‌ స్వీకరణ ఉంటుందని రిటర్నింగ్‌

ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

19 వరకు నామినేషన్ల స్వీకరణ

నిజామాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. సెలవు దినాలైన శని, ఆదివారాలు మినహా ఈనెల 19వ తేదీ వరకు నామినేషన్‌ స్వీకరణ ఉంటుందని రిటర్నింగ్‌ అధికారి అయిన జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి ప్రకటించారు. 20న నామినేషన్లను పరిశీలిస్తామని తెలిపారు. 23వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంటుందని, అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఏప్రిల్‌ 7న ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆరు కేంద్రాలలో పోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్‌ 9న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలను ప్రకటిస్తామని ఆయన నోటిఫికేషన్‌లో ప్రకటించారు. 

Updated Date - 2020-03-13T09:21:39+05:30 IST