ములుగు జిల్లా ‘రామప్ప’లో శిల్ప కళాశాల

ABN , First Publish Date - 2020-12-18T04:08:32+05:30 IST

ములుగు జిల్లా ‘రామప్ప’లో శిల్ప కళాశాల

ములుగు జిల్లా ‘రామప్ప’లో శిల్ప కళాశాల

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా‌సరెడ్డి 

హన్మకొండ టౌన్‌, డిసెంబరు 17: సీఎం కేసీఆర్‌ అ నుమతితో ములుగు జిల్లా రామప్ప దేవాలయంలో త్వరలో శిల్ప కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా్సరెడ్డి తెలిపారు. త్వరలో డీపీఆర్‌ తయారు చేసి ముఖ్యమంత్రికి సమర్పిస్తామన్నారు. రెండు రోజుల క్రితం ఎంపీ సంతో్‌షతో కలిసి తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిలా శిల్ప ఉత్పత్తి విభాగాన్ని పరిశీలించినట్లు పోచంపల్లి గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు. రామప్పను అంతర్జాతీయ స్థాయి టూరిజం స్పాట్‌గా తీ ర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ కళాశాల ఏర్పాటు చేస్తే అటు పురాతన కళను, ఇటు పూర్వవైభవాన్ని ఇనుమడింపజేసే అవకాశం ఉంటుందని తెలిపారు. కళాశాల ఏర్పాటుకు సంబంధించి ప్రాజెక్టు రిపోర్టును త్వరలో సీఎంకు సమర్పిస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ అనుమతి రాగానే కళాశాల ఏర్పాటు చేస్తామని పోచంపల్లి తెలిపారు. 

Updated Date - 2020-12-18T04:08:32+05:30 IST