మొక్కు చెల్లించుకున్న ఎమ్మెల్సీ కవిత

ABN , First Publish Date - 2020-12-10T08:20:41+05:30 IST

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన కల్వకుంట్ల కవిత.. కొండస్వామి ఆలయంలో మొక్కు చెల్లించుకున్నారు

మొక్కు చెల్లించుకున్న ఎమ్మెల్సీ కవిత

మెట్‌పల్లి రూరల్‌, డిసెంబరు 9: నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన కల్వకుంట్ల కవిత.. కొండస్వామి ఆలయంలో మొక్కు చెల్లించుకున్నారు. ఆమె విజయాన్ని ఆకాంక్షిస్తూ జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని జగ్గాసాగర్‌ గ్రామశివారులో ఉన్న కొండస్వామి ఆలయంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు పుల్ల జగన్‌గౌడ్‌ అప్పట్లో ముడుపు కట్టారు. బుధవారం ఆమె ఆ ముడుపు విప్పి మొక్కు చెల్లించుకున్నారు. రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. కవితకు గౌడ సంఘ సభ్యులు ఘనస్వాగతం పలికారు. శాలువా, పూలమాలతో సత్కరించారు.

Updated Date - 2020-12-10T08:20:41+05:30 IST