రైతు బంధుపై నిబంధనలు సరికాదు: జీవన్ రెడ్డి
ABN , First Publish Date - 2020-06-23T22:36:32+05:30 IST
వ్యవసాయ రంగంలో ప్రభుత్వ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంగళవారం ఆయన లేఖ రాశారు.

హైదరాబాద్: వ్యవసాయ రంగంలో ప్రభుత్వ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంగళవారం ఆయన లేఖ రాశారు. రైతు రుణమాఫీ ఇంకా అమలు కాలేదన్నారు. రైతు బంధుపై నిబంధనలు విధించడం సరికాదన్నారు. ధాన్యం సేకరణలో 5 నుంచి 10 కిలోల కోతతో రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. సన్నరకాలకు క్వింటాకు రూ.2,500 మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అదేవిధంగా పండ్ల తోటల రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు.