కృష్ణా జలాల్లో తెలంగాణ వాటపై కేసీఆర్ దే బాధ్యత: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-08-12T18:40:30+05:30 IST

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటపై కేసీఆర్ దే బాధ్యత: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటపై కేసీఆర్ దే బాధ్యత: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

జగిత్యాల: కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై కేసీఆర్‌దే బాధ్యత అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ జగన్‌తో సీఎం కేసీఆర్ కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లయినా.. ఇంకా గత పాలకులదే తప్పా అని ఆయన ప్రశ్నించారు. కృష్ణా జలాలను తీసుకుపోయేలా జగన్ ప్లాన్ చేస్తుంటే.. కేసీఆర్ ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రాజెక్టులను డిజైన్ చేస్తోంది ఇంజనీర్లు కాదని.. కాంట్రాక్టర్లని తెలిపారు. అక్కడా వాడే..ఇక్కడా వాడే అని...దమ్ముంటే ఆ కాంట్రాక్టర్లను తెలంగాణలో బ్లాక్ లిస్టులో పెట్టాలని సవాల్ విసిరారు. నీళ్ల కోసమే కదా తెలంగాణ పోరాటం.. ఆ నీళ్లు తరలిపోతుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారని జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-08-12T18:40:30+05:30 IST