నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-12T14:04:20+05:30 IST

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఆరు టేబుళ్లపై రెండు రౌండ్‌ల పాటు కౌంటింగ్

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం

నిజామాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఆరు టేబుళ్లపై రెండు రౌండ్‌ల పాటు కౌంటింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 823 ఓట్లు పోలవగా, మొదటి రౌండ్‌లో 600 ఓట్లను లెక్కించనున్నారు. రెండో రౌండ్‌లో 223 ఓట్లను లెక్కిస్తారు. పోలైన ఓట్లలో వాలిడ్ ఓట్లు తీయగా సగానికంటే ఒక ఓటు ఎక్కువ పోలైన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. విజేత మ్యాజిక్ ఫిగర్ 413 ఓట్లు కాగా, మొదటి రౌండ్‌లోనే ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల అధికారులు ఉదయం 10. 30 నిమిషాల్లోపే విజేతను ప్రకటించనున్నారు. ఇదిలాఉండగా, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత భారీ మెజారిటీతో గెలుస్తారని టీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 

Updated Date - 2020-10-12T14:04:20+05:30 IST