ఎమ్మెల్యే వనమా మనుమరాలి పెళ్లి వాయిదా

ABN , First Publish Date - 2020-03-24T11:14:41+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు మనుమరాలు వనమా అలేఖ్య వివాహం సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో వాయిదాపడింది.

ఎమ్మెల్యే వనమా మనుమరాలి  పెళ్లి వాయిదా

సీఎం కేసీఆర్‌ సూచనతో నిర్ణయం

పాల్వంచ, మార్చి 23: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు మనుమరాలు వనమా అలేఖ్య వివాహం సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో వాయిదాపడింది. ఈ విషయాన్ని సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  వనమా వెల్లడించారు. వనమా పెద్దకుమారుడు రాఘవేందర్‌రావు పెద్దకుమార్తె అలేఖ్య నిశ్చితార్థం గత నెలలో నిర్వహించారు. ఏప్రిల్‌ 4న పాల్వంచలో పెళ్లి జరగాల్సి ఉంది.


సీఎం కేసీఆర్‌ను, ఉమ్మడి తెలుగు ప్రభుత్వాల మంత్రులు, ఎమ్మెల్యేలను వేడుకకు ఆహ్వానించామన్నారు. వేలమంది అభిమానుల సమక్షంలో నిర్వహించిన తలపెట్టిన వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావంతో అనేక కార్యక్రమలు రద్దవుతుండటంతో సీఎం కేసీఆర్‌ సూచన మేరకు వివాహాన్ని వాయిదా వేసుకున్నామని వనమా వివరించారు.  

Updated Date - 2020-03-24T11:14:41+05:30 IST