స్వయం ఉపాధి పథకాలపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2020-12-18T04:10:05+05:30 IST

స్వయం ఉపాధి పథకాలపై అవగాహన కల్పించాలి

స్వయం ఉపాధి పథకాలపై అవగాహన కల్పించాలి
రుణ ప్రణాళిక‌ను విడుదల చేస్తున్న ఎమ్మెల్యే

బ్యాంకర్లతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి కలెక్టరేట్‌, డిసెంబరు 17: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలపై అవగాహన కలిగేలా సదస్సులు నిర్వహించాలని బ్యాంకర్లను భూపాలపల్లి ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు.  కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ స్వర్ణలత అధ్యక్షతన గురువారం జరిగిన బ్యాంకర్ల సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. నాబార్డు రూ.874.54 కోట్ల నిధులతో రూపొందించిన 2021-22 వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుద్యోగ యువత, రైతులు, మహిళల ఆర్థిక అభివృధ్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో కూడిన పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. బ్యాంకర్లు ప్రభుత్వ సంకల్పానికి తోడ్పాటు అందించాలని అన్నారు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం సబ్సిడీతో అందిస్తున్న రుణాలపై జిల్లా వ్యాప్తంగా బ్యాంకర్లు అవగాహన కలిగించాలన్నారు. నిర్దేశిత లక్ష్యం మేరకు రైతులకు పంట రుణాలు, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ రుణాలను సకాలంలో అందించాలన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం చేపట్టిన పనులకు ఊతం ఇవ్వాలన్నారు 


Updated Date - 2020-12-18T04:10:05+05:30 IST