కరోనా బాధితుడికి ఎమ్మెల్యే చికిత్స

ABN , First Publish Date - 2020-08-16T23:56:10+05:30 IST

జగిత్యాల మండలం అంతర్గాంకు చెందిన గీత కార్మికుడు శంకర్ గౌడ్ ఇటీవల ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడగా తలకు తీవ్రగాయమై కాలు విరిగింది.

కరోనా బాధితుడికి ఎమ్మెల్యే చికిత్స

జగిత్యాల: జగిత్యాల మండలం అంతర్గాంకు చెందిన గీత కార్మికుడు శంకర్ గౌడ్ ఇటీవల ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడగా తలకు తీవ్రగాయమై కాలు విరిగింది. అయితే కరీంనగర్‌లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో శంకర్ గౌడ్ హోం ఐసోలేషన్‌లో ఉంటున్నాడు. ఇటు తలకు గాయం, కాలు విరగటంతో నరకయాతన అనుభవిస్తున్నాడు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, ఆర్దోపెడిక్ వైద్యుడు నవీన్, అసిస్టెంట్ రవికిరణ్‌తో కలిసి పీపీఈ కిట్స్ ధరించి అంతర్గాంలోని శంకర్ గౌడ్‌కు ఇంట్లోనే చికిత్స చేశారు. చికిత్స ద్వారా శంకర్ గౌడ్ కాస్త ఉమశమనం పొందాడు. కరోనాతో పోరాడుతున్నప్పటికి ఎలాంటి తీవ్ర లక్షణాలేవి లేవని ఎమ్మెల్యే తెలిపారు. శంకర్ గౌడ్‌కు తలకు గాయం, కాలు విరగటంతో నొప్పి భరించలేక నరకయాతన అనుభవిస్తున్నందున ఉపశమనం కోసం తక్షణ వైద్యాన్ని అందించామని ఆయన చెప్పారు. కరోనా నెగెటివ్ వచ్చిన అనంతరం పూర్తి స్దాయిలో శస్త్ర చికిత్స అందిస్తామని కుటుంబభ్యులకు సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. 

Updated Date - 2020-08-16T23:56:10+05:30 IST