కేంద్రం ప్యాకేజీ ఏ ఒక్కరికీ మేలు చేసేలా లేదు: శ్రీధర్‌బాబు

ABN , First Publish Date - 2020-05-17T20:09:59+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీతో ఏ ఒక్కరికీ మేలు చేసేలా లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.

కేంద్రం ప్యాకేజీ ఏ ఒక్కరికీ మేలు చేసేలా లేదు: శ్రీధర్‌బాబు

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీతో ఏ ఒక్కరికీ మేలు చేసేలా లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. తెల్లరేషన్‌ కార్డుదారులకు రూ.7500 ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బొగ్గు గనులు, ఇతర రంగాలను ప్రైవేటీకరించొద్దన్నారు. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్తూ మధ్యలోనే చనిపోతుండటం బాధాకరమన్నారు. వలస కార్మికులకు అన్యాయంపై ప్రశ్నించిన సీనియర్ నేత వీహెచ్‌ను అరెస్ట్‌ చేయడాన్ని శ్రీధర్‌బాబు తీవ్రంగా ఖండించారు.

Updated Date - 2020-05-17T20:09:59+05:30 IST