ధైర్యంగా ఉండండి

ABN , First Publish Date - 2020-12-29T04:00:57+05:30 IST

ధైర్యంగా ఉండండి

ధైర్యంగా ఉండండి

ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌

మహబూబాబాద్‌ రూరల్‌, డిసెంబరు 28 : తండాలోని ప్రజలందరూ అధైర్యపడకుండా  ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ భరోసా కల్పించారు. మహబూబాబాద్‌ మండలం అయోధ్య శివారు భజనతండాలోని ప్రజలు వారం రోజుల నుంచి 116 మందికి వాంతులు, వీరేచనాలు, కడుపునొప్పి భారీన పడుతున్న విషయం తెలుసుకుని సోమవారం ఆ తండాలో పర్యటించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్యాధికారులు తండాలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మిషన్‌ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీటిని అందించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ కృష్ణారెడ్డితో ఫోన్‌చేసి చెప్పారు. ఈ ఘటన జరగడానికి గల కారణాలను వెంటనే తెలుసుకోవాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. మూడ్రోజుల క్రితం ఆర్‌టీపీసీఆర్‌ కరోనా పరీక్షల్లో 35 మందికి నెగిటివ్‌ వచ్చిందని మల్యాల పీహెచ్‌సీ వైద్యుడు అవినాష్‌ తెలిపారు. అనంతరం జిల్లా అంటువ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్‌ సీతామహాలక్ష్మి తండాలో పర్యటించారు. మునిసిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, నాయిని రంజిత్‌, తేళ్ల శ్రీను, లూనావత్‌ అశోక్‌నాయక్‌, సుధగాని మురళి, నర్సింగ్‌వెంకన్న, రాజు, ఉప్పలయ్య, కోల సత్యం ఉన్నారు. 

 

Updated Date - 2020-12-29T04:00:57+05:30 IST