క్రీడాస్ఫూర్తిని చాటాలి
ABN , First Publish Date - 2020-12-28T04:54:18+05:30 IST
క్రీడాస్ఫూర్తిని చాటాలి

మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్
మహబూబాబాద్‌టౌన్, డిసెంబరు 27: క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు వాటితో సంబంధం లేకుండా క్రీడాస్ఫూర్తిని చాటాలని మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. మహబూబాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో పది రోజులుగా నిర్వహిస్తున్న మహబూబాబాద్ ప్రీమియర్ లీగ్(ఎంపీఎల్) టీ-10 క్రికెట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఫైనల్‌లో మర్రిగూడెం, కిష్టాపురం జట్లు తలపడగా మర్రిగూడెం జట్టు విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకోగా రన్నరప్‌గా కిష్టాపురం నిలిచింది. తృతీయ స్థానంలో టీజీ-బాయ్స్ మహబూబాబాద్ జట్టు నిలిచింది. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన జట్లకు ట్రోపీతో పాటు రూ.30వేలు, రూ.15వేలు, రూ.10వేల నగదు బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ క్రీడా చరిత్రలో మానుకోటకు ఘనచరిత్ర ఉందన్నారు. ఇక్కడి నుంచి అనేక మంది రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాల్లో నిలిచారని చెప్పారు. కాగా, ఫైనల్ మ్యాచ్‌లో సిక్స్ కొట్టిన బ్యాట్స్‌మెన్ గౌస్‌కు మునిసిపల్ చైర్మన్ రాంమోహన్‌రెడ్డి రూ.5వేల నగదు, అత్యధిక వికెట్లు తీసిన ఉపేందర్‌కు టీఆర్‌ఎస్ నాయకుడు పర్కాల శ్రీనివాస్‌రెడ్డి రూ.3వేల నగదు ప్రోత్సాహక బహుమతి అందజేశారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్‌చైర్మన్ ఎమ్డీ.ఫరీద్, క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కేఎస్‌ఎన్.రెడ్డి, యాళ్ల మురళీధర్‌రెడ్డి, పీవీ.ప్రసాద్, డాక్టర్ చాపల రంజిత్‌రెడ్డి, రామసహాయం వెంకట్‌రెడ్డి, నాయిని రంజిత్, దీపక్ ఝూవర్, రాజశేఖర్, ప్రభాకర్, గోపి, రఫిక్, రాహూల్ నాయుడు, చిట్టి పాల్గొన్నారు.