గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే సీతక్క

ABN , First Publish Date - 2020-08-20T10:26:23+05:30 IST

మండలంలోని రాంనగర్‌, దుంపెల్లిగూడెం గ్రామా ల్లో బుధవారం ఎమ్మెల్యే ధనసరి సీతక్క కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు.

గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే సీతక్క

గోవిందరావుపేట, ఆగస్టు 19: మండలంలోని రాంనగర్‌, దుంపెల్లిగూడెం గ్రామా ల్లో బుధవారం ఎమ్మెల్యే ధనసరి సీతక్క కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. రాంనగర్‌లో భారీ వర్షాలకు బానోతు రాజు ఇంటిగోడ కూలిపోవడం తో ఇంటిని పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అదేవిధంగా దుం పెల్లిగూడెంలో అనారోగ్యంతో బాధపడుతున్న తిరుమలరెడ్డి శ్రీనివాసరెడ్డిని పరామ ర్శించారు. ఆమె వెంట పార్టీ మండల అధ్యక్షుడు పన్నాల ఎల్లారెడ్డి, నాయకులు కొం పెల్లి శ్రీనివాసరెడ్డి, ధర్మ అంజిరెడ్డి, ముద్దబోయిన రాము, సుక్యానాయక్‌, లింగారెడ్డి, శ్రీను, కృష్ణ, నరేందర్‌, బొల్లు కుమారస్వామి, పూర్ణ, సత్తిరెడ్డి, మూడ్‌ ప్రతాప్‌సింగ్‌, కట్ల జనార్ధన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, సోమయ్య, జనార్ధన్‌రెడ్డి, ఐలురెడ్డిలు ఉన్నారు.

Read more