పోడు భూములపై ప్రభుత్వం కుట్ర: సీతక్క

ABN , First Publish Date - 2020-12-28T04:26:42+05:30 IST

కేసీఆర్‌ మోసపూరిత మాటలతో రాజ్యమేలుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బోనులో ఉండే పులులను అడవిలోకి ..

పోడు భూములపై ప్రభుత్వం కుట్ర: సీతక్క

భద్రాద్రి: కేసీఆర్‌ మోసపూరిత మాటలతో రాజ్యమేలుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బోనులో ఉండే పులులను అడవిలోకి వదులుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. పులులు అనేది ప్రభుత్వం ఆడిస్తున్న నాటకమన్నారు. పోడు భూములను టైగర్ జోన్ చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీతక్క ఆరోపించారు. పులుల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సీతక్క మండిపడ్డారు. 

Updated Date - 2020-12-28T04:26:42+05:30 IST