రైతు లేనిదే రాజ్యం లేదు: సీతక్క
ABN , First Publish Date - 2020-12-08T04:28:53+05:30 IST
దేశవ్యాప్తంగా మంగళవారం రైతు సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుకు కాంగ్రెస్ మద్దతిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు..

మహబూబాబాద్: దేశవ్యాప్తంగా మంగళవారం చేపట్టనున్న రైతు బంద్‌కు కాంగ్రెస్ మద్దతిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు. అధిష్టానం పిలుపు మేరకు ప్రతి కార్యకర్త బంద్‌లో పాల్గొనాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు కష్టపడితేనే మనం అన్నం తింటున్నామన్నారు. రైతుకు కష్టం వస్తే భూమి మీద అన్నం తినే ప్రతి వ్యక్తి రైతుకు మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. కార్పొరేట్ కంపెనీలు ఉత్పత్తి చేసే వస్తువులు మాత్రమే తిని బతకగలమని అనుకునే వారు మాత్రం ఈ బంద్‌కు మద్దతు ఇవ్వరని సీతక్క అన్నారు.