ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే సీతక్క

ABN , First Publish Date - 2020-07-22T17:09:32+05:30 IST

టీఆర్ఎస్ ప్రభుత్వంపై ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు.

ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే సీతక్క

వరంగల్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు. వైద్యం అందక ప్రజల ప్రాణాలు పోతుంటే సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజలు అవస్థలు పడుతుంటే.. కొత్త సచివాలయ నిర్మాణం ఇప్పుడు అవసరమా? అని ప్రశ్నించారు. వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో కోవిడ్ వార్డును ఆమె పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎంలో అనుకున్నస్థాయిలో సిబ్బంది, పరికరాలు లేవని, దీంతో డాక్టర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రతి జిల్లాలో కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, బాధితులకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని సీతక్క ప్రభుత్వానికి సూచించారు.

Updated Date - 2020-07-22T17:09:32+05:30 IST