ఎమ్మెల్యే సీతక్క ఉగ్రరూపం..ప్రగతి భవన్ సాక్షిగా అరెస్ట్

ABN , First Publish Date - 2020-09-18T19:43:08+05:30 IST

ములుగు ఎమ్మెల్యే సీతక్క ఉగ్రరూపం ప్రదర్శించారు.

ఎమ్మెల్యే సీతక్క ఉగ్రరూపం..ప్రగతి భవన్ సాక్షిగా అరెస్ట్

హైదరాబాద్‌: ములుగు ఎమ్మెల్యే సీతక్క ఉగ్రరూపం ప్రదర్శించారు. శుక్రవారం ప్రగతిభవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ యత్నించింది. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. కారు దిగిన సమయంలో తనపై చేయవేసిన మహిళా పోలీస్‌ను సీతక్క హెచ్చరించారు. చేయిఎందుకు వేస్తారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఎమ్మెల్యే సీతక్క మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆమెతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.


రైతుల గురించి అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించలేదని, భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని సీతక్క డిమాండ్‌ చేశారు. సభలో కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆమె మండిపడ్దారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్కతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు, కిసాన్ సెల్‌ నేత అన్వేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-18T19:43:08+05:30 IST