ఓటుకు నోటు కేసు: సండ్రపై విచారణ ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-16T01:43:05+05:30 IST

ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరిగింది. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై విచారణ ప్రక్రియను కోర్టు ప్రారంభించింది

ఓటుకు నోటు కేసు: సండ్రపై విచారణ ప్రారంభం

హైదరాబాద్‌: ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరిగింది. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై విచారణ ప్రక్రియను కోర్టు ప్రారంభించింది. సండ్రపై అవినీతి నిరోధక చట్టంలోని 12, ఐపీసీ 120బి రెడ్ విత్ 34 సెక్షన్లతో అభియోగాలు నమోదయ్యాయి. ఏసీబీ అభియోగాలను సండ్ర వెంకటవీరయ్య తోసిపుచ్చారు. ఈకేసులో రేవంత్‌రెడ్డి, సండ్ర, సెబాస్టియన్ కోర్టుకు హాజరయ్యారు. గైర్హాజరైన ఉదయ్ సింహపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా కోర్టు వేసింది.

Updated Date - 2020-12-16T01:43:05+05:30 IST