తెలంగాణలో అటవీశాఖ అధికారుల తీరు సరిగ్గా లేదు: రేగ కాంతారావు

ABN , First Publish Date - 2020-12-15T22:17:18+05:30 IST

ఎమ్మెల్యే రేగ కాంతారావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అటవీశాఖ అధికారుల తీరు సరిగ్గా లేదని ..

తెలంగాణలో అటవీశాఖ అధికారుల తీరు సరిగ్గా లేదు: రేగ కాంతారావు

హైదరాబాద్: ప్రభుత్వ విప్ రేగ కాంతారావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అటవీశాఖ అధికారుల తీరు సరిగ్గా లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను ఫారెస్ట్ అధికారులు లెక్కచేయడం లేదని తెలిపారు. కేంద్ర చట్టాలు మాత్రమే అమలు చేస్తామంటున్నారని ఆయన చెప్పారు. పంట భూముల్లో కందకాలు తీస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని రేగ కాంతారావు అన్నారు. ఫారెస్ట్ అధికారుల చర్యలతో గిరిజనులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఫారెస్ట్ అధికారులు గ్రామాల్లోకి వస్తే నిర్భందిస్తామని కాంతారావు హెచ్చరించారు.

Updated Date - 2020-12-15T22:17:18+05:30 IST