ఆవులను తరలిస్తున్న ట్రక్‌ను అడ్డుకున్న ఎమ్మెల్యే రాజసింగ్
ABN , First Publish Date - 2020-12-15T15:43:23+05:30 IST
ఆవులను తరలిస్తోన్న ట్రక్‌ను బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ అడ్డుకున్నారు.

హైదరాబాద్: చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 33 ఆవులను తరలిస్తోన్న ట్రక్‌ను బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవులను హింసించటం సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధమన్నారు. జిల్లాల నుంచి ప్రతిరోజు బర్కత్‌పురకు పదుల సంఖ్యలో ట్రకులొస్తున్నాయన్నారు. కట్టర్ హిందువుగా చెప్పుకుంటోన్న సీఎం కేసీఆర్ ఆవుల తరలింపును ఎందుకు అడ్డుకోవటంలేదని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాజసింగ్ విమర్శించారు.