దుబ్బాకలో ఒక యుద్ధం జరుగుతోంది: ఎమ్మెల్యే రాజాసింగ్‌

ABN , First Publish Date - 2020-10-31T18:40:31+05:30 IST

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నిక పొలిటికల్ హీట్‌ను పెంచుతున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని పార్టీల ప్రధాన నేతలంతా దుబ్బాకకు చేరుకుని

దుబ్బాకలో ఒక యుద్ధం జరుగుతోంది: ఎమ్మెల్యే రాజాసింగ్‌

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నిక పొలిటికల్ హీట్‌ను పెంచుతున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని పార్టీల ప్రధాన నేతలంతా దుబ్బాకకు చేరుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా దౌల్తాబాద్ మండలంలో రాజాసింగ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. దుబ్బాకలో ఒక యుద్ధం జరుగుతోందన్నారు. రఘునందన్‌ను అసెంబ్లీకి పంపిస్తే.. ద్రోహులను బట్టలు లేకుండా తిప్పితిప్పి కొడతారని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. దుబ్బాక అభివృద్ధి రఘునందన్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. దుబ్బాకలో ఎన్ని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టించారో హరీష్‌ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే ఇళ్లు ఇచ్చారని రాజాసింగ్‌ వెల్లడించారు. 

 


Updated Date - 2020-10-31T18:40:31+05:30 IST