ఎమ్మెల్యే రాజయ్యకు త్రుటిలో తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2020-12-14T04:36:32+05:30 IST

ఎమ్మెల్యే రాజయ్యకు త్రుటిలో తప్పిన ప్రమాదం

ఎమ్మెల్యే రాజయ్యకు త్రుటిలో తప్పిన ప్రమాదం

రఘునాథపల్లి, డిసెంబరు 13: స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్యకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి జనగామ జిల్లా కేంద్రంలో జరిగే ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి వెళ్తున్న క్రమంలో రఘునాథపల్లి మండల కేంద్రంలో ముందు వెళ్తున్న ఇసుక లారీ ఆకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో దాని వెనక ఉన్న పోలీసు వాహనాన్ని సైతం సడన్‌గా ఆపారు. దీంతో ఎమ్మెల్యే వాహనం పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే వాహనం ముందు భాగం దెబ్బతింది. ఎమ్మెల్యే రాజయ్యకు ఎలాంటి గాయాలు తగలకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2020-12-14T04:36:32+05:30 IST