ఎమ్మెల్యే పర్యటనలో ‘మండలం’ నిరసనలు

ABN , First Publish Date - 2020-12-31T05:06:55+05:30 IST

ఎమ్మెల్యే పర్యటనలో ‘మండలం’ నిరసనలు

ఎమ్మెల్యే పర్యటనలో ‘మండలం’ నిరసనలు
ఇనుగుర్తిలో రోడ్డుపై బైఠాయించిన మండల సాధన సమితి నాయకులు

కేసముద్రం, డిసెంబరు 30 : మండలంలోని ఇనుగుర్తిలో బుధవారం రైతువేదిక భవనాన్ని ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ ప్రారంభించారు. అంతకుముందు ఇనుగుర్తి మండలం ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ మండల సాధన సమితి కన్వీనర్‌ చిన్నాల కట్టయ్య ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యేను రానీయకుండా చిన్నబస్టాండ్‌ సెంటర్‌లో రోడ్డుకు అడ్డుగా నిలిచారు. అప్పటికే అక్కడ పోలీసులు, స్పెషల్‌ పార్టీ పోలీసులు మోహరించి ఉండడంతో వారిని నిలిపివేశారు. దీంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి చొక్కాలు విప్పి నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. వారిని అరెస్ట్‌ చేసి పోలీసు వ్యానులోకి ఎక్కించడంతో ఎమ్మెల్యే రైతువేదిక భవనం ప్రారంభించేందుకు ముందుకు కదిలారు. ఎమ్మెల్యే కార్యక్రమం అనంతరం వదిలిపెట్టారు. నిరసన తెలిపిన వారిలో గుజ్జునూరి బాబురావు, కొట్టం మహేందర్‌, మామిడి జనార్దన్‌, నోముల నాగేశ్వర్‌రావు, కాల్సాని ప్రభాకర్‌, బండారి వెంకన్న, తమ్మడపల్లి యాదగిరి, బానోత్‌ సూర్య, నాగెల్లి వెంకన్న, పరుపాటి రావేందర్‌, ఎమ్మీ.రహీం ఉన్నారు. ఈ సందర్భంగా రూరల్‌ సీఐ రవికుమార్‌తోపాటు ఇద్దరు ఎస్సైలు, స్పెషల్‌పార్టీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, రాబోయే 2021 కొత్త సంవత్సరంలో ఇనుగుర్తి మండ లం ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ రైతువేదిక ప్రారంభోత్సవ సభలో అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దార్ల రాంమూర్తి, సొసైటీ చైర్మన్‌ ధీకొండ వెంకన్న, బొబ్బిలి మహేందర్‌రెడ్డి, దామెరకొండ ప్రవీణ్‌కుమార్‌, నజీర్‌అహ్మద్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-31T05:06:55+05:30 IST