కోనేరు కోనప్పను అభినందించిన సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-12-31T01:34:54+05:30 IST

కోనేరు చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నియోజక వర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే

కోనేరు కోనప్పను అభినందించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: కోనేరు చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నియోజక వర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అభినందించారు. కోనప్ప కుటుంబ సభ్యులు బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలుసుకున్నారు. నియోజక వర్గంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ప్రతి రోజూ 1000 మందికి అన్నదానం చేయడం, స్కూళ్లకు టీవీలు అందజేయడం, టీచర్‌- పోలీసు- మిలిటరీ ఫారెస్టు పోస్టులకు దరఖాస్తుచేసుకున్న వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడం , ఇంటర్‌ కాలేజీల్లో మధ్యాహ్నభోజనం పెట్టడం, రక్తహీనత ఉన్న మహిళలకు పోషకాహారం అందించడం, ఎస్సీ, ఎస్టీలకు సామాహిక వివాహాలు జరిపించడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ స్పూర్తిగా నిలుస్తున్నారని సీఎం అభినందించారు. నియోజక వర్గంలో అభివృద్ధి, సంక్షేమ  కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్నందుకు ముఖ్యమ్రంతికి ఎమ్మెల్యే కోనప్ప కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2020-12-31T01:34:54+05:30 IST